Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి 

ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలం పసర గ్రామంలో ఎం ఎస్ టి జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పస్రా మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి భూక్య సుమలత, ఎం ఎస్ పి జాతీయ నేత ఇరుగుపైడి లు హాజరై డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమతావాదీ, భారతదేశ మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహాయోధున్ని స్మరిస్తూ దేశ ప్రజలందరికీ ఎమ్మార్పీఎస్ పక్షాన జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మందకృష్ణ  పక్షాన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కి తక్షణమే భారతరత్న ప్రకటించాలని  డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రసాద్ , మచ్చాపూర్ సర్పంచి జంపాల ప్రభాకర్  బీసీ సంఘ జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుగుజు వెంకన్న, ఎం ఎస్ ఎఫ్ ములుగు జిల్లా అధ్యక్షులు పేరాల బలరాం, మాదిగ ఉద్యోగుల సంఘం జిల్లా బాధ్యులు ఎల్పీ రామ్,మాదిగ ఎం ఎస్ పి  మండల అధ్యక్షులు పసుల భద్రయ్య,బి ఆర్ ఎస్ పార్టీ పసర గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ , టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ ములుగు జిల్లా నాయకులు తోకల రాంబాబు,  ఎమ్మార్పీఎస్ పసర గ్రామ కమిటీ అధ్యక్షులు సుంచు యాకోబు, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు వేల్పుల సాంబయ్య భరత్ మాదిగ తొగరి నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -