నవతెలంగాణ – భిక్కనూర్
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దార్థ విద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటారు. 10వ తరగతి విద్యార్థి సాయివరుణ్ గౌడ్ డిస్కస్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. అదేవిధంగా బాలికల 600 మీటర్ల పరుగు పందెంలో 10వ తరగతి విద్యార్థిని తొలికుల అనూష కాంస్య పతకం సాధించింది. డిస్కస్ త్రోలో ప్రతిభ కనబరిచిన సాయివరుణ్ గౌడ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సుధాకర్, ప్రిన్సిపాల్ శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. పాఠశాల పిఈటి బీరయ్య అందిస్తున్న శిక్షణ, సేవలతో విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తారని వారు తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన సాయివరుణ్ గౌడ్‌ను ఉపాధ్యాయ బృందం అభినందించి, విజయాన్ని కొనియాడింది. విద్యార్థుల విజయాలు పాఠశాలకు గర్వకారణమని, క్రీడల్లో మరింత ప్రోత్సాహం అందిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపారు.
జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో సిద్దార్థ విద్యార్థుల సత్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



