Saturday, August 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలునీరజ్‌ చోప్రాకు రెండో స్థానం.. త్రుటిలో చేజారిన స్వర్ణం

నీరజ్‌ చోప్రాకు రెండో స్థానం.. త్రుటిలో చేజారిన స్వర్ణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లుసానె డైమండ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్‌లో తన అత్యుత్తమ త్రో నమోదు చేసినప్పటికీ, కేవలం త్రుటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకున్నాడు. నేడు జరిగిన ఈ పోటీలో శ్రీలంక అథ్లెట్ రుమేశ్‌ పతిరగే మరోసారి నీరజ్‌పై ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలిచాడు. పోటీ ఆరంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. నీరజ్ తన తొలి ప్రయత్నంలో 83.54 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అయితే, తన రెండో ప్రయత్నంలో ఏకంగా 88.05 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి ఒక్కసారిగా అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇది ఈ 2026 సీజన్‌లో నీరజ్‌కు అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. దీంతో నీరజ్‌కు స్వర్ణం ఖాయమని అంతా భావించారు.

కానీ, శ్రీలంక అథ్లెట్ పతిరగే అంత తేలిగ్గా వదల్లేదు. తన మూడో ప్రయత్నంలో 88.14 మీటర్ల దూరం విసిరి నీరజ్‌ను వెనక్కి నెట్టి తిరిగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత నీరజ్ తన తదుపరి ప్రయత్నంలో 83.72 మీటర్లు విసరగా, నాలుగో ప్రయత్నం ఫౌల్ అయింది. ఐదో ప్రయత్నాన్ని నీరజ్ వదిలేయగా, చివరి ఆరో ప్రయత్నంలో 82 మీటర్లు మాత్రమే విసరడంతో పతిరగే విజయం ఖాయమైంది. ఈ పోటీలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 86.69 మీటర్ల త్రోతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో నీరజ్ చోప్రాపై రుమేశ్‌ పతిరగే పైచేయి సాధించడం ఇది మూడోసారి. గతంలో కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా పతిరగే 88.68 మీటర్ల త్రోతో స్వర్ణం గెలవగా, నీరజ్ రజతంతో సరిపెట్టుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -