Wednesday, April 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శనగ కొనుగోళ్లు.. పంట సర్వేయర్ల అక్రమ వసూళ్లు

శనగ కొనుగోళ్లు.. పంట సర్వేయర్ల అక్రమ వసూళ్లు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో పంట సర్వేయర్ల అక్రమ వసూళ్ళ దందా కొనసాగుతోంది. రూ.1 వెయ్యి నుంచి 6 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. నగదు ఇచ్చిన వారి పంటను మాత్రమే తూకం వేస్తున్నారు. మిగతా వారి పంట బాగాలేదని, తూకం వేయుటకు నిరాకరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బాదిత రైతులు తహశీల్దార్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో శనగ కొనుగోలు కేంద్రంలో పంట సర్వేయర్లు జోరుగా అక్రమ వసూళ్ళకు పాల్పడుతున్నారని అన్నారు. క్వింటాలకు రూ.100 చొప్పును వసూలు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికే చాలా మంది రైతులు భారీగా నష్టపోయారని అన్నారు. వెంటనే సర్వేయర్ల అక్రమ వసూళ్ళను ఆపి, తమకు న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -