- Advertisement -
ముంబయి : స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న ఒడిదుడుకులు కొత్త ఇన్వెస్టర్ల ఉత్సాహంపై ప్రతికూల ప్రభావం చూపాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26లో కొత్త డీమ్యాట్ ఖాతాలు 22 శాతం క్షీణించాయి. అంతకుముందు 2024-25లో రికార్డు స్థాయిలో 4.1 కోట్ల ఖాతాలు ప్రారంభం కాగా.. గడిచిన ఏడాది ఆ సంఖ్య 3.2 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే దేశవ్యాప్తంగా మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య మాత్రం 22.5 కోట్లు దాటింది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా నిఫ్టీ 5.1 శాతం, సెన్సెక్స్ 7.1 శాతం క్షీణించడం, అంతర్జాతీయంగా అమెరికా టారిఫ్ నిర్ణయాలు, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం ఇన్వెస్టర్లను వెనకడుగు వేసేలా చేశాయి.
- Advertisement -



