- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని సమాఖ్య అధ్యక్షుడు చెన్నుపాటి మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు డిమాండ్ చేశారు. సినిమాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి పాత్రను ప్రతికూల కోణంలో చిత్రీకరించారని, ఆ పాత్ర వెనుక అల్లూరి జిల్లాలోని సీలేరు జిల్లా పరిషత్తు పాఠశాల ఉందని, విద్యార్థుల యూనిఫామ్ కూడా ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్ మాదిరిగానే ఉందని ఆరోపించారు. ఉపాధ్యాయ వృత్తిని, విద్యా వ్యవస్థను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని సమాఖ్య పేర్కొంది.
- Advertisement -



