నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యుత్ శాఖలోని ఆర్టిజన్ల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీఎస్ఈబీ రెగ్యులేషన్లను వర్తింపజేయాలనీ, ఇతర అన్ని సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. కీలక సమయంలో జరుగుతున్న ఈ సమ్మెలో ఒక కేటగిరీ కార్మికులకు వ్యతిరేకంగా మరొక కేటగిరీ కార్మికులను ఎగదోసే యాజమాన్య ఎత్తుగడలను విద్యుత్ ఉద్యోగులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టిజన్ల సమ్మె సమయంలో ఉద్యోగులతో ఆ పనులు చేపిస్తే…పీఆర్సీ కోసం శాశ్వత ఉద్యోగులు పోరాడే సమయంలో ఆర్టిజన్లతో యాజమాన్యం పని చేయించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో గరిష్ట ఐక్యతతో యాజమాన్య ఎత్తుగడలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిజన్ల పోరాటానికి ప్రజలు, ఉద్యోగులు సహకరించాలని కోరారు.
ఆర్టిజన్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు : సీఐటీయూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



