Thursday, April 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్టిన బిడ్డకు ఆరు నెలల పాటు తల్లిపాలే శ్రేయస్కరం

పుట్టిన బిడ్డకు ఆరు నెలల పాటు తల్లిపాలే శ్రేయస్కరం

- Advertisement -

ఐసిడిఎస్ సూపర్వైజర్ దేవకరణ 
నవతెలంగాణ – మద్నూర్

పుట్టిన బిడ్డకు ఆరు నెలల పాటు తల్లిపాలే శ్రేయస్కరమని డోంగ్లి మండలంలోని హాసన్ టాక్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ దేవకరణ అన్నారు. గురువారం పోషణ్ పక్వాడాలో భాగంగా అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యత గురించి ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ..పుట్టిన ప్రతి బిడ్డకు 6 నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలని, ఇతర ఆహార పదార్థాలను ఇవ్వకూడదు సూచించారు. 7వ నెలలో తల్లి పాలతో పాటు మెత్తని (ఇడ్లీ వంటి) ఆహారాన్ని పెట్టాలని అన్నారు. ప్రతి నెల 1న పిల్లల బరువు, ఎత్తు, వారి పెరుగుదల ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సచిత, ఆశ కార్యకర్త తల్లులు,  గ్రామ అధ్యక్షురాలు గంగామణి, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -