అల్ జజీరా జర్నలిస్ట్ మహమ్మద్ విషా మృతి
గాజా నగరానికి పశ్చిమాన ఉన్న తీరప్రాంత రహదారి అయిన అల్-రషీద్ వీధిలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. దీంతో అల్ జజీరా ముబాషర్ కరస్పాండెంట్ అయిన విషా గాజాలో మరణించారు. ఈ వైమానిక దాడి కారణంగా కారు మంటల్లో కాలిపోయిందని స్థానికులు తెలిపారు.
అక్టోబర్ 2023లో గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ జాతి నిర్మూలన యుద్ధాన్ని ప్రారంభించి నప్పటి నుంచి గాజా స్ట్రిప్‌లోని జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటోంది. అప్పటి నుంచి గాజాపై జరిగిన ఇజ్రాయిల్ దాడుల్లో కనీసం 262 మంది జర్నలిస్టులు మరణించారని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ‘యుద్ధ విరమణ’ అమల్లోకి వచ్చి దాదాపు ఆరు నెలలు గడిచినా, ఇజ్రాయిల్ ఉల్లంఘనలు కొనసాగు తూనే ఉన్నాయి.
”యుద్ధ విరమణ” అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం సుమారు 2,000 ఉల్లంఘనలకు పాల్పడిం దని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం చెబుతోంది. ”గాజా స్ట్రిప్‌లో పాలస్తీనా జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలపై జరుగుతున్న ఈ వ్యవస్థీకత నేరాలను ఖండించాలని” అది అంతర్జాతీయ జర్నలి స్టుల సమాఖ్య, అరబ్ జర్నలిస్టుల సంఘం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థలకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 2023 నుంచి ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండలో 72,000 మందికి పైగా ప్రజలు చని పోయారు. 171,000 మందికి పైగా గాయపడ్డారు. గత అక్టోబర్‌లో అమల్లోకి వచ్చిన అమెరికా మద్దతుగల కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న ఇజ్రాయిల్ దాష్టీకం మాత్రం ఆగటంలేదు.గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయిల్ దాడులలో కనీసం 733 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. 2,034 మంది గాయపడ్డారు.
గాజాపై ఇజ్రాయిల్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



