- Advertisement -
టెల్‌అవీవ్ : ఇటు ఇజ్రాయిల్ దుశ్చర్యలు ఆగడం లేదు. గాజాను టార్గెట్‌గా చేసుకుంటూ దాడులు కొనసాగిస్తోంది. కాల్పలు విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. తాజాగా గాజా మధ్య ప్రాంతంలోని నుసైరాత్ శరణార్థుల శిబిరం పశ్చిమ భాగంలో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారని అక్కడి అధికారులు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయిల్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- Advertisement -


