- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల నూతన తహశీల్దార్ గా శనివారం రంజిత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు ఆయనను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని మండల ప్రజలను కోరారు.
- Advertisement -



