Friday, August 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళం

నేపాల్ వరద బాధితులకు ఒక నెల జీతం విరాళం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారీ వరదల నేపథ్యంలో, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా, ఆయన మంత్రివర్గ సభ్యులు ఒక నెల జీతాన్ని ‘ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి’కి జమ చేయాలని శుక్రవారం నిర్ణయించారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఆధ్వర్యంలో శుక్రవారం సింఘా దర్బార్‌లోని ప్రధాన మంత్రి,మంత్రుల మండలి కార్యాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. రసువాలోని భోటెకోషి ప్రాంతంలో సంభవించిన భారీ వరదల వల్ల జరిగిన నష్టం, అలాగే చేపట్టాల్సిన సహాయక, పునరావాస, పునర్నిర్మాణ చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నేపాల్ ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఫేస్‌బుక్‌లో తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం మరియు దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వరదల వల్ల నష్టపోయిన వ్యక్తులు, వ్యాపార సంస్థల కోసం సహాయం పునరావాస ప్యాకేజీని రూపొందించాలని మంత్రివర్గం ఆర్థిక శాఖను ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -