నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా భూగర్భ (అండర్‌గ్రౌండ్), ఓపెన్‌కాస్ట్ గనులతో పాటు అక్కడి ప్రొడక్షన్ యూనిట్లు, బంగారం శుద్ధి కేంద్రాల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మైనింగ్, శుద్ధి ప్రక్రియలకు సంబంధించిన సమగ్ర వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థను కేవలం సంప్రదాయ బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా, బంగారం, రాగి వంటి కీలక లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తి రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
కర్ణాటకలోని ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించిన భట్టి విక్రమార్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



