- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాఖీ పౌర్ణమిపండగ సందర్భంగాజూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రులు సీతక్క , కొండా సురేఖ ఇవాళ ఉదయం సీఎం నివాసానికి చేరుకున్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆయనకు రాఖీలు కట్టారు. అనంతరం సీఎంతో పాటు ఇద్దరు మంత్రులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
- Advertisement -



