- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబడిపాళెం వద్ద 71వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ ఆదిలక్ష్మి ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -



