- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వశిష్ట గోదావరి వంతెన వద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేల్పూరు గ్రామానికి చెందిన దొడ్డా సాయి (29), శిరీష (28) తమ మూడేళ్ల కుమార్తెను స్కూటీపై వదిలి గోదావరి నదిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. చీకట్లో ఒంటరిగా మిగిలిపోయిన చిన్నారి ఏడుపు స్థానికులను కలచివేసింది. పోలీసులు చిన్నారిని సంరక్షించి, గల్లంతైన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -


