Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్

సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్

- Advertisement -

‘గూఢచారి’కి సిక్వెల్‌గా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ ‘జీ2’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న వరల్డ్ వైడ్ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవు తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ‘గూఢచారి’ సక్సెస్‌ను బేస్‌గా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇండియన్ సినిమాలో స్పై థ్రిల్లర్ జోనర్‌ని రీడిఫైన్ చేయనుంది. ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ వున్న క్యారెక్టర్ ఇది. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా రిలీజ్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -