Thursday, September 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆద్యంతం వైవిధ్యభరితం

ఆద్యంతం వైవిధ్యభరితం

- Advertisement -

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకుడు. ఈ చిత్రాన్ని లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఈ సినిమాను నవంబర్ 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా ప్రకటించారు.
ఈ అందమైన సినిమాను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేలా టీమ్‌ భారీ స్థాయిలో డిఫ‌రెంట్ స్టైల్‌ ప్రమోషన్స్‌ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘చిట్టి చిట్టి చీమ’ పాటకు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట మ్యూజిక్ లవర్స్‌కు అడిక్షన్‌గా మారుతోంది. నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ తో మూవీపై పాజిటివ్ వైబ్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతున్నాయి. వైవిధ్య‌మైన కథలను ఎంచుకుంటూ వరుస విజయా లతో దూసుకెళ్తున్న దుల్కర్ సల్మాన్.. దర్శకుడు పవన్ సాధినేని క్రియేటివ్ విజన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రిలోనూ ఆసక్తి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -