హీరో సూర్య, మలయాళ దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి తన 47వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘ఆవేశం’ ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సీన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జఘరం స్టూడియోస్, 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ‘సీన్’ టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్ ప్రారంభంలో సూర్య ఓ విచిత్రమైన పోలీస్ ఆఫీసర్‌గా వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేశారు. డీఎస్పీ ప్రేమ్‌రాజ్ గా సూర్య పవర్ఫుల్ ఎంట్రీ అదిరిపోయింది. ఓ కానిస్టేబుల్ భుజంపై చేయి వేసుకుని నడుస్తూ వచ్చే సూర్య.. ఎంత కష్టమైన క్రిమినల్ అయినా అతడిని ట్రాక్ చేసి పట్టుకోగల తన ప్రత్యేక సామర్థ్యాన్ని తెలియజేసే పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం ఆకట్టుకుంది. తనదైన స్టైల్లో ఇచ్చే వార్నింగ్ మరింత ఇంపాక్ట్‌ను క్రియేట్ చేసిందని మేకర్స్ తెలిపారు.
దీపావళి కానుకగా ‘సీన్’ రిలీజ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



