Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలో పోషణ పక్వాడ

అంగన్వాడీలో పోషణ పక్వాడ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
కాటారం మండల కేంద్రంలోని అంగన్వాడీలో మహిళలు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు పోషణ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ శివరాణి ఆధ్వర్యంలో సోమవారం  నిర్వహించారు. ఈ సందర్బంగా సూపర్వైజర్ శివరాణి మాట్లాడుతూ.. గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవాలని సూచించారు.

డెలివరీ అనంతరం వెంటనే శిశువుకు ముర్రుపాలు (కొలస్ట్రం) ఇవ్వడం ఎంతో ముఖ్యమని, దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు. పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం అత్యంత అవసరమని, ఈ కాలాన్ని “గోల్డెన్ డేస్”గా పేర్కొన్నారు. అలాగే రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేర్చుకోవాలని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది,ఏ ఎఏన్ఎం శ్యామల, టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -