Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళారులకు నమ్మి మోసపోవద్దు 

దళారులకు నమ్మి మోసపోవద్దు 

- Advertisement -

జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు: ఆర్మూర్ చిన్న బాలరాజ్ 
నవతెలంగాణ – దర్పల్లి
రైతులు కష్టపడి పండించిన వరిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు జరిపి లాభాలను ఆర్జించాలని డీసీసీ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ రైతులను కోరారు. సోమవారము ఆయన మండలంలో హోన్నజీపేట్ సొసైటీ ఆధ్వర్యంలోని హోన్నజీపేట్ , వాడి, మద్దుల్ తాండల్లోని సొసైటీ చెందిన అలాగే ఐసీడీఎమ్మెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్ లు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఏ గ్రేడ్ ధాన్యం ప్రతి కింటాలికి రూ.2389, బి గ్రేడ్ రూ.2369 గా ప్రభుత్వం అందించనుందని తెలిపారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టి, చెన్ని పట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు కోరారు. వారంలోపు ప్రభుత్వం రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడం జరుగుతుందని అన్నారు. సిబ్బంది కొరత, గన్ని బ్యాగుల కొరత, లారీల కొరత లేకుండా కొనుగులులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమములో సొసైటీ కార్యదర్శి గంగానర్సయ్య, మాజీ సొసైటీ చెరమెన్లు జనార్ధన్ రెడ్డి, చెలిమెల మల్లికార్జున్, నాయకులు భగవాన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, జాన్ రెడ్డి, మాలవత్ లక్ష్మణ్ నాయక్, డా.రాజేంధర్, బాగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ద్యాప రాజు,క ట్ట మోహన్, రొండ్ల గంగారెడ్డి, వెంకట్ రెడ్డి, సతీష్, అరుణ గోపాల్, వసంత్ రావు, రాజేంధర్, గోపి చంద్, లచ్చీరామ్, సకృ, రాంరెడ్డి రైతు సోదరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -