– విద్యార్థులకు ప్రోత్సాహం
– లక్ష్యం తో చదివితేనే ఉత్తమ ఫలితాలు
– మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను వీకేడీవీఎస్ రాజు కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించి, వారి కృషిని ప్రశంసించారు. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడాలని, విజయానికి క్రమశిక్షణే మూలమని తెలిపారు.
ప్రిన్సిపాల్ శేషుబాబు మాట్లాడుతూ, కళాశాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు.విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలు కప్పి సన్మానించారు.ప్రశంసాపూర్వక ప్రసంగం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


