నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో ప్రజల సౌకర్యార్థం సుందరమైన పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. బస్టాండ్ వెనుక సుభాష్ నగర్ కాలనీలో ప్రభాకర్ హాస్పిటల్ వద్ద ఆదివారం మేరా యువభారత్ లో భాగంగా, యూత్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ.. ఆలేరు సమగ్ర అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను చేపడుతామని చెప్పారు. యువ చైతన్య కార్యక్రమాల గురించి మహేష్ వివరించారు.
రిటైర్డ్ టీచర్ బి.బాలరాజు గౌడ్, పాల్గొని యువత మంచి స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, వెంకట్, గణేష్, కృష్ణ, రమేష్, వంశీ, నాగరాజు, జీవన్, నాగరాజు, కార్తీక్, వికాస్,టింకు, నిఖిల్, యువజన సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



