సర్పంచ్ కంతి మధు
నవతెలంగాణ – ఆలేర్ రూరల్
ఆలేర్ మండలం శారాజీపేట గ్రామ యువతకు మరియు రవాణా చేసే ప్రతి ఒక్కరికి గ్రామ సర్పంచ్ కంతి మధు ముఖ్య గమనిక జారీ చేశారు. రవాణా సమయంలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాపాయం కలిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. లైసెన్స్ లేని వారు వాహనాలు నడపకూడదని, శిక్షణ పొందిన డ్రైవర్లు మాత్రమే రవాణా చేయాలని తెలిపారు.
ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. ముఖ్యంగా జిబ్రా లైన్లు,ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం,రోడ్డుపై ఎడమ వైపు ప్రయాణించడం వంటి నియమాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. యువత డ్రైవింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రవాణా భద్రతపై అవగాహన కల్పిస్తూ ఆయన చేసిన సూచనలు యువతలో మంచి స్ఫూర్తిని నింపాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దూడల శ్రీధర్ గౌడ్,గ్రామ సెక్రటరీ స్వప్న, డాక్టర్ అనుజ,ఆశా వర్కర్ సరిత, వీబీకె మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.



