నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మడంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయ కుమారి సోమవారం ఉపాధి హామీ పనులు జరుగుతున్న క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారని ఎస్ఏ సూర్యకాంత్ తలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఎఫ్ఏ మాట్లాడుతూ గ్రామంలో నిత్యము ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తున్నామని తెలిపారు. పని ప్రదేశంలో అధికారులు నిబంధనల మేరకు కొలతల ప్రకారం పనులు నిర్వహించిన వారికి పూర్తిస్థాయిలో కూలీ డబ్బులు రావడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కొలతల ప్రకారం పనులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా రోజురోజుకు ఎండలు ఎక్కువవుతున్నాయని కూలీలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని, ఉదయం 6 గంటలక పని ప్రదేశంలో హాజరు కవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ సవిత, ఫీల్డ్ అసిస్టెంట్, మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
జోరుగా జాతీయ ఉపాధి హామీ పనులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



