నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ భవనంలో సోమవారం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ) గ్రామ సభ మండలంలోని 30 గ్రామాల గ్రామపంచాయతీ సర్పంచ్ లతొ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు జుక్కల్ గ్రామంలో 99 రోజుల ప్రణాళిక సందర్భంగా “రోడ్డు భద్రత “జాగ్రత్తల విషయంపై ప్రత్యేక గ్రామసభ సమావేశం నిర్వహించడం జరిగిందని జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో 1) . గ్రామంలో రహదారి కమిటీ ఏర్పాటు చేయాలని, 2). రహదారి భద్రత పైన అందరికీ అన్ని శాఖల నుంచి ప్రజలకు అవగాహనపర్చాలని అజెండా అంశాలు నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ గారు, ఉప సర్పంచ్ షేక్ పీర్దోస్ , జుక్కల్ SI మురళి సార్ గారు,సాయ గౌడ్ గారు(Ex:సొసైటీ చైర్మన్), గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు గైక్వాడ్ విట్టల్ ,సాయినాథ్,ప్రకాశ్,చంద్రకళ, గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామ ప్రజలు, మరియు గ్రామ యువకులు బొంపెల్లి వార్ విజయకుమార్, శ్రీనివాస్, ఇర్ఫాన్, బాలరాజ్, పాల్గొనడం జరిగింది.



