Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిరిజన హాస్టల్ లో పేరెంట్స్ మీటింగ్

గిరిజన హాస్టల్ లో పేరెంట్స్ మీటింగ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో గిరిజన హాస్టల్లో సోమవారం పేరెంట్స్ మీటింగ్ సమావేశం వార్డెన్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో వార్డెన్ శాంతి కుమారి మాట్లాడుతూ. హాస్టల్ విద్యార్థులు నిత్యము క్రమశిక్షణతో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇంటికి సెలవుల్లో వచ్చినప్పుడు క్రమశిక్షణ గా ఉండే విధంగా వారికి తెలియచేయాలని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు అందిస్తున్న మెనూ ప్రకారం భోజనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కొరకు వారి ఆర్థిక పరిస్థితిని గమనంలోకి తీసుకొని వారి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించేందుకు గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారని అన్నారు. హాస్టల్లో నిత్యం మెనూ ప్రకారం ఆహారంతో పాటు సాయంత్రం పూట ఆటల పోటీలు మరియు ట్యూషన్ చెప్పడం జరుగుతుందని అన్నారు. తమ హాస్టల్లో ఉంటున్న పిల్లల పేరెంట్స్ వారికి హాస్టల్లో కల్పిస్తున్న సదుపాయాలని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి చూపించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ తోపాటు హాస్టల్ పిల్లల తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -