Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేది ప్రజా ప్రభుత్వమే: ఎమ్మెల్యే

పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేది ప్రజా ప్రభుత్వమే: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ, పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి, తిరుమలగిరి, మద్దిరాల, నూతనకల్, జాజిరెడ్డిగూడెం మండలాలకు సంబంధించిన(268) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు.

ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే వైద్య సేవలను 10 లక్షల రూపాయలకు పెంపు, పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ, సన్న వడ్లపై బోనస్ అందిస్తూ,కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు వంటి ఎన్నో హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో వారి వెంట రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, పట్టణ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు, నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల లబ్ధిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -