Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘తెల్ల కాగితం’.. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌

‘తెల్ల కాగితం’.. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కృష్ణ కొమ్మలపాటి సమర్పణలో నిర్మితమవుతున్న సినిమా ‘తెల్ల కాగితం’. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి చిత్రాలతో విజయం సాధించిన హర్ష్ రోషన్‌ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో రమేష్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్, ‘చిలకా’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
ఈ సినిమా అక్టోబర్ 2న ఘనంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌ ప్రస్తుతం అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను కలిగించేలా ఉంది. ఇందులో హర్ష్ రోషన్, నక్షత్ర జంట ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. పోస్టర్‌లో చూపించిన ఆ వర్షపు చినుకులు, గొడుగులా అడ్డుగా పెట్టుకున్న అరిటాకు, హీరోహీరోయిన్ల లుక్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తున్నాయి.

ప్రమోషనల్ కంటెంట్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి ప్రభావాన్ని చూపించేలా ఉంది. ‘సామజవరగమన’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి విజయవంతమైన వినోదాత్మక చిత్రాలకు సహ-రచయితగా గుర్తింపు పొందిన రైటర్ నందు సవిరిగాన ఈ చిత్రానికి కథ అందించడమే కాకుండా స్క్రీన్‌ప్లే , సంభాషణలను కూడా రాశారు. ‘బేబీ’ వంటి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను ఇచ్చి విజయ వంతంగా దూసుకుపోతోన్న మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కె.వి. గుహన్ కెమెరామెన్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు అని చిత్ర బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -