Sunday, August 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏపీలో సినిమా రాజధానిగా విశాఖపట్నం

ఏపీలో సినిమా రాజధానిగా విశాఖపట్నం

- Advertisement -

భీమిలి సాగర తీరంలోని తిమ్మాపురం వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో సినీ సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్, దర్శకుడు మెహర్ రమేష్, హీరోయిన్ హెబ్బా పటేల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 12 ఏళ్లకు ఏర్పడిన ఎపీఎఫ్‌డీసీ కమిటీ సభ్యులను వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ కమిటీ సభ్యులు, టాలెంట్ రియల్ స్టూడియో ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అలాగే టాలెంట్ ప్రొడక్షన్స్, కంటిపూటి క్రియేషన్స్ పేరుతో రెండు నూతన సినీ నిర్మాణ సంస్థలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎపీఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ, ‘అమరావతి అభివృద్ధితో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లో సినీ రంగాన్ని కూడా మరింత అభివృద్ధి చేయ డానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విశాఖ పట్నాన్ని సినీ రంగానికి ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దేం దుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాము.

విశాఖలో డబ్బింగ్ థియేటర్లను అభివృద్ధి చేయడంతో పాటు, త్వరలో జాతీయ స్థాయి అవార్డుల వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తాం. సినిమా షూటింగ్స్‌కు అనుమతులు సులభంగా లభించేలా సింగిల్ విండో విధానం తీసుకురానున్నాం. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో సినిమా షూటింగ్స్ జరిగేలా చర్యలు తీసుకుంటాం. చిన్న సినిమాలే సినీ పరిశ్రమకు బలం, వాటి వల్లే పరి శ్రమలో కొత్త ప్రతిభకు అవకాశాలు లభిస్తున్నాయి. సినిమాలో బలమైన కంటెంట్ ఉంటే ఎవరితో సినిమా తీశారనేది పెద్దగా ముఖ్యం కాదు’ అని అన్నారు. ‘విశాఖపట్నం త్వరలో సినిమా రాజధానిగా మార బోతోంది. మౌలిక సదుపాయాలను మరింత మెరుగు పరచడంతో పాటు, భవిష్యత్‌లో పెద్ద సంఖ్యలో ఇక్కడ సినిమా షూటింగ్స్ జరిగేలా కృషి చేస్తున్నాం’ అని దర్శకుడు మెహర్ రమేష్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -