Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాజ్ తరుణ్ హీరోగా ‘టార్టాయిస్’

రాజ్ తరుణ్ హీరోగా ‘టార్టాయిస్’

- Advertisement -

స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో ఎవరు అనేది నిన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ ఉత్కంఠతకు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు?, ఆయన సినిమా ఏంటి? అనేది అనౌన్స్ చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘టార్టాయిస్’ అంటూ మేకర్స్ ఆదివారం ప్రకటించారు. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. రాజ్ తరుణ్ తన కెరీర్ లో ఇప్పటిదాకా చేయని ఒక కొత్త తరహా క్యారెక్టర్ చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తో మేకర్స్‌ రివీల్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -