Monday, August 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడిఫరెంట్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌

డిఫరెంట్‌ ఎమోషనల్‌ థ్రిల్లర్‌

- Advertisement -

ఫస్ట్ కాపీ మూవీస్, కేడి & కో బ్యానర్ పై వాచస్పతి దర్శకత్వంలో పంచుమర్తి నరేష్ బాబు నిర్మించిన సినిమా ‘మిస్సింగ్ మేఘన’. ఇందులోని 2వ సాంగ్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంచ్‌ చేసి లిరిక్స్ , మ్యూజిక్ బాగున్నాయని, సినిమా కూడా హిట్ అవుతుంది ఆకాంక్ష‍ించారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధిం చిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా జరగగా, తరువాత ‘సింగిల్ పిల్ల పిల్ల పిల్ల’ పాట ప్రొడ్యూసర్ సురేష్ బాబు లాంచ్ చేశారు.
దర్శకుడు వాచస్పతి మాట్లా డుతూ,‘మేము రిలీజ్ చేసిన సాంగ్ , టీజర్ కు ఆడియన్స్, డిజిటల్ ప్లాట్ఫామ్ నుండి మంచి అప్లాజ్ వచ్చింది. మంచి ఎమోష నల్ థ్రిల్లర్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీ కూడా ఇందులో ఉంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాలేదు. మా సాంగ్స్, టీజర్ ఎంత బాగున్నాయో, సినిమా అంత కంటే బాగుంటుంది’ అని అన్నారు. ‘దిల్ రాజు మా పాట విని చాలా బాగుంది అనడం, మాకు మంచి బూస్ట్ నిచ్చింది. నేనే స్వర పరచి, సంగీతం అందించిన ఈ పాటను దిల్ రాజు లాంచ్ చేయడం నాకు బాగా స్పెషల్’ అని సంగీత దర్శ కుడు ఆర్.ఆర్.ధృవన్ చెప్పారు. హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, ‘ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు చేతుల మీదుగా నా సాంగ్ లాంచ్ అవ్వడం హ్యాపీ గా ఉంది. ఆయన హార్ట్ ఫుల్ గా పాట బాగుంది, సినిమా కూడా హిట్ అవ్వాలి అని బ్లెస్ చేశారు. ఆయన అన్నట్టే సినిమా కూడా వచ్చింది. అలాగే ప్రేక్ష‍కులకు కూడా మా సినిమా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -