నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామ అంగన్వాడీల్లో సోమవారం పోషన్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి ముఖ్యదితిగా హాజరై మాట్లాడారు మహిళలు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు గర్భధారణ దశ నుంచే తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రక్తహీనత లేకుండా పోషకాహారం తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవచ్చన్నారు. డెలివరీ తరువాత వెంటనే శిశువుకు ముర్రుపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని, దాని ద్వారా శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పుట్టిన మొదటి నెల నుంచి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను కొనసాగించడం అత్యంత అవసరమని, ఈ కాలాన్ని “గోల్డెన్ డేస్”గా పేర్కొన్నారు.
అలాగే రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేర్చుకోవాలని, అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. చిన్నారులకు, కిశోర బాలికలకు పౌష్టికాహారం తీసుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు సుమలత, మమత, స్వరూప, ఆశలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.



