Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు.!

ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సోమవారం ముందస్తుగా నిర్వహించినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.

అంబేద్కర్ రాజ్యాంగ రచించడానికి రెండు సంవత్సరాలు 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని ఆయన తెలిపారు. అంబేద్కర్ గొప్ప సంఘసంస్కర్త, స్వేచ్ఛను, సమానత్వం గూర్చి వివరించడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రూపొందించింది భారత దేశ రాజ్యాంగమన్నారు. అంబేద్కర్ చేసినటువంటి గొప్ప విషయాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -