Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన శ్రీపాదరావుకు ఘన నివాళులు

ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన శ్రీపాదరావుకు ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
ప్రజాసేవనే జీవన ధ్యేయంగా భావించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 27వ వర్ధంతి సందర్భంగా కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిర్మల సమ్మయ్య పాల్గొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీపాదరావు  ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన మహనీయుడని కొనియాడారు. ప్రజాసేవనే తన ప్రాణంగా భావించిన ఆయన న్యాయం, నిష్పక్షపాతానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన కృషి అమోఘమని, ముఖ్యంగా రహదారులు, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా అందరితో స్నేహభావంతో మెలిగిన అజాత శత్రువుగా ఆయన నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలు, చూపిన మార్గం నేటి ప్రజాప్రతినిధులకు మార్గదర్శకమని, సమాజానికి దీపస్తంభాలుగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిన్నల బ్రహ్మారెడ్డి, కమిటీ సభ్యులు పిల్లమరి రమేష్, శ్రీనివాస్, పంతకాని సమ్మయ్య (డీసీసీ జిల్లా అధికార ప్రతినిధి), ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న, కుంభం రమేష్ రెడ్డి, ఉడుముల విజయ, సర్పంచ్ కిషన్ నాయక్, డబ్బేటా దేవేందర్, ఉప్పుల రజిత, సోదారి దేవయ్య , కుమార్ యాదవ్, ప్రభు సుందిళ్ల, కొండగొర్ల  రామనారాయణ, బీరెల్లి మహేష్, బేడిక లక్ష్మి, గాలి సమ్మయ్య, రైతులు, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -