Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే అరైవ్-అలైవ్ లక్ష్యం: ఎస్పీ

రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే అరైవ్-అలైవ్ లక్ష్యం: ఎస్పీ

- Advertisement -

ఎస్పీ డీ జానకీ ధరావత్ 
నవతెలంగాణ – నవాబు పేట
“గ్రామ స్థాయిలో డ్రైవింగ్ లైసెన్స్ లేని అర్హులైన వ్యక్తులను గుర్తించి, వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపిఎస్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా వివిధ గ్రామాలలో గ్రామ సభలు,రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహణలో భాగంగా మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపు చేయడం“అరైవ్ అలైవ్”కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత కమిటీలు స్థానిక సమస్యలను గుర్తించి,సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం జిల్లా పోలీసు శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణపై వివరిస్తూ,ప్రతి ప్రమాదం ఒక కుటుంబానికి తిరిగిరాని నష్టం కలిగిస్తుందని,అందువల్ల ప్రతి వాహనదారుడు బాధ్యతతో ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ విధానాలపై అవగాహన కల్పిస్తూ,ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.

వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, నిర్దేశిత వేగ పరిమితులను పాటించాలని, హెల్మెట్ సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. పాదచారులకు రహదారులపై ప్రాధాన్యత ఇవ్వడం, ట్రాఫిక్ సంకేతాలను కచ్చితంగా పాటించడం అవసరమని తెలిపారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వెంటనే స్పందించి, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తూ సమీప ఆసుపత్రికి తరలించేలా సహకరించాలని యువతకు పిలుపునిచ్చారు.అదనంగా, గ్రామాల్లో ప్రమాదాలకు గురయ్యే ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, పాఠశాల స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం,యువతను వాలంటీర్‌గా భాగస్వామ్యం చేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి సమయంలో రిఫ్లెక్టివ్ స్టికర్లు వినియోగం, ట్రాక్టర్లు మరియు వ్యవసాయ వాహనాలపై సురక్షిత చర్యలు పాటించడం వంటి అంశాలపై కూడా అవగాహన కల్పించారు.

“గ్రామ స్థాయిలో డ్రైవింగ్ లైసెన్స్ లేని అర్హులైన వ్యక్తులను గుర్తించి,వారికి డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవసరమైన సహాయం మార్గదర్శకత్వం అందించబడుతుందని జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపిఎస్ తెలిపారు.కార్యక్రమం ముగింపులో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించడంతో పాటు, రోడ్డు భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ అధికారి సంధ్య, డీటీఓ రఘు కుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ అశోక్, మండల ఆరోగ్య అధికారి శ్రావణ్ కుమార్ వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎస్సై విక్రమ్, రుద్రారం సర్పంచ్, కారుకొండ సర్పంచ్ సంతోషి భూపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి, రాములు,రవిందర్ గౌడ్ రాజశేఖర్ రెడ్డి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు సర్పంచ్లు నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -