Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదవాడి కళ్ళలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం 

పేదవాడి కళ్ళలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్
నవతెలంగాణ- నెల్లికుదురు 

జిల్లాలో ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ జిల్లా అధ్యక్షురాలు భూక్య భూమా మురళి నాయక్ మాజీ జిల్లా అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి అన్నారు. సోమవారం బంజర గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు గొల్లంపల్లి ప్రభాకర్ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని సత్యపాల్ రెడ్డి తో కలిసి ఆరాల సుజాత సురేష్ ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు గౌరవప్రదమైన పక్కా గృహాలను అందించడం,ప్రతి కుటుంబానికి వారి స్వంత స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు, పేద కుటుంబాలు, దళితులు, గిరిజనులు, వికలాంగులు మరియు భూమిలేని వ్యక్తులకు విడతల వారికి కచ్చితంగా వారికి ఇల్లు ఇచ్చి ఈ యొక్క ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ఇందిరమ్మ నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. అదేవిధంగా ఈ విడతలో ఇందిరమ్మ ఇల్లులు రాని ప్రతి ఒక్కరికి రెండో విడతలో కచ్చితంగా సమకూచితమైన స్థానాన్ని కల్పించి వారి యొక్క ఇందిరమ్మ ఇల్లును కట్టుకునే వారి కలను నెరవేరుస్తామన్నారు చెప్పారు. ఈ నియోజకవర్గానికి రావాల్సిన ఇండ్ల కంటే అదనంగా వేయిండ్లు ఎక్కువ తెప్పించాడు మన ఎమ్మెల్యే మురళి నాయక్ అని తెలిపారు.  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడు బడుగు బలహీన పేద వర్గాలకు అండదండగా ఉంటుందన్నారు.

 అనంతరం గ్రామ సర్పంచ్ మాలోత్ హరికృష్ణ  డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ కి, జిల్లా మాజీ అధ్యక్షులు జేన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి నీ శాలువతో సత్కరించారు. ఈ  కార్యక్రమంలో బంజారా గ్రామ సర్పంచ్, మాలోతు హరిక్రిష్ణ, నెల్లికుదురు మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని సత్యపాల్ రెడ్డి , గూగుల్ వద్దు బాలాజీ నాయక్, మండల నాయకులు ఆకుతోట సతీష్ పెరుమాండ్ల రాజు, గ్రామ అధ్యక్షులు అనిల్ , ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ కొంతమంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -