నవతెలంగాణ-రాయికల్
రాయికల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును సోమవారం పురపాలక కార్యాలయంలో నిర్వహించారు. పెరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని ఎస్సై సిహెచ్ సుధీర్ రావు సూచించారు. “రోడ్డు భద్రత మనందరి బాధ్యత” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి నిబంధనలు పాటిద్దాం-సురక్షితంగా గమ్యాన్ని చేరుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ దేవదాస్,మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీంధర్, మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి, కూనారపు మానస, వేముల మౌనిక, బత్తిని మహేశ్వరి, భూక్య రాకేష్ నాయక్, పల్లికొండ గంగాధర్ పాల్గొన్నారు.
రాయికల్‌లో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా సదస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



