Monday, August 31, 2026
E-PAPER
Homeఖమ్మంద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు

- Advertisement -

– వెంటనే స్పందించిన 108 సిబ్బంది
నవతెలంగాణ-సత్తుపల్లి 
ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలైన ఘటన సత్తుపల్లి మండలం బుగ్గపాడులో శనివారం రాత్రి జరిగింది.‌ బుగ్గపాడు పంచాయతీ పరిధిలోని గాంధీనగర్ కు  చెందిన బేతి మల్లేష్ అనే వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, సత్తుపల్లి వైపు నుంచి పట్వారీగూడెం వెళ్తున్న ద్విచక్ర వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడి ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయి, ఎముక బయటకు రావడంతో తీవ్ర రక్తస్రావమైంది. ​సమాచారం అందుకున్న సత్తుపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్పందించారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) గొల్లమందల కృష్ణ, పైలట్ కట్టం మహేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన సిబ్బంది, బాధితుడికి అంబులెన్స్‌లోనే అత్యవసర ప్రథమ చికిత్స అందిస్తూ సత్తుపల్లి ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించి వృద్ధుడికి మెరుగైన వైద్యం అందిస్తూ ఆసుపత్రికి చేర్చిన 108 సిబ్బందిని ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ ఆలేటి ప్రణయ్ కుమార్  అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -