Thursday, April 16, 2026
E-PAPER
Homeబీజినెస్దిగుమతుల భారం తగ్గించడమే లక్ష్యం

దిగుమతుల భారం తగ్గించడమే లక్ష్యం

- Advertisement -

ఖనిజరంగంలో స్వయంసమృద్ధి కీలకం : కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్‌

భారతదేశాన్ని ఖనిజ రంగంలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన క్లిష్టమైన ఖనిజ బ్లాకుల 7వ విడత వేలం రోడ్‌షోలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఖనిజ సంపద ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, భారీగా ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఈ రంగాన్ని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే చూడటం లేదు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, మన దేశ అవసరాలకు అవసరమైన క్లిష్టమైన ఖనిజాలను మనమే వెలికితీసుకునేలా భారీ అడుగులు వేస్తున్నాం” అని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో అర్బన్‌ మైనింగ్‌, బొగ్గు గ్యాసిఫికేషన్‌ వంటి నూతన పద్ధతుల ద్వారా ఖనిజ వెలికితీతకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఈ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేయాలని ఆయన ప్రయివేటు రంగానికి సూచించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 212 ఖనిజ బ్లాకులను వేలం వేసినట్లు గనుల శాఖ కార్యదర్శి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. 2015లో వేలం నిబంధనలు అమలులోకి వచ్చిన ప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 684 బ్లాకులను వేలం వేశామన్నారు. దేశాభివృద్ధికి కీలక మైన క్రిటికల్‌ మినరల్స్‌ విభాగంలో ఇప్పటి వరకు మొత్తం 71 బ్లాకుల వేలం పూర్తయిందని, ఇందులో కేంద్రం 46, రాష్ట్ర ప్రభుత్వాలు 25 బ్లాకులను వేలం వేశా యని ఆయన వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -