నవతెలంగాణ-హైదరాబాద్: డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రం నష్టపోదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ను అమల్లోకి తెచ్చి లోక్ సభలో మూడింటి ఒక వంతు స్థానాలను మహిళలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం 272 స్థానాలకు పెరుగుతుందని ఆయన చెప్పారు. మొత్తం 815 స్థానాల్లో 272 స్థానాలను మహిళలకే కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81ని సవరించడం ద్వారా లోక్‌సభలో రాష్ట్రాల నుంచి ఎన్నుకొనే సభ్యుల సంఖ్యను గరిష్టంగా 815కి, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకొనే వారి సంఖ్యను 35కి కేంద్ర ప్రభుత్వం పెంచాలని నిర్ణయించిదన్నారు. అయితే పార్లమెంట్‌లో ఇవాళ ప్రవేశపెట్టిన చట్టసభల్లో మహిళలకు 33 శాతం బిల్లుతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మోడీ సర్కార్ ప్రవేశపెట్టింది. కాగా మహిళ బిల్లు పూర్తి మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు, డీలిమిటేషన్ పై సమగ్ర చర్చ జరగాలని, సదురు బిల్లును మహిళ రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టవద్దని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి నష్టంలేదు: అర్జున్ రామ్ మేఘ్వాల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



