Monday, August 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత

విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందజేత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పరిధిలోగల రామారావుపల్లె ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఏకరూప దుస్తులను సోమవారం మండల ఎంపిడిఓ క్రాంతి కుమార్, గ్రామ సర్పంచ్ బండి స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.పద్మ, ఐకెపి ఏపీఎం హనుమంతరావు అందజేశారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా మెరుగైన విద్య, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిన పాఠ్యపుస్తకాలు, ఏకరుప దుస్తులు తదితరవి అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -