- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నుంచి ఎండలు మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటలవరకు బయటకు రావద్దని సూచించింది.
- Advertisement -



