- Advertisement -
నవెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హన్మకొండ జిల్లాకు చెందిన తండ్రీకొడుకులు మృతి చెందారు. పెద్ద అంబర్పేట్-బొంగులూరు మార్గంలో ప్రయాణిస్తున్న వేద ప్రకాశ్ రెడ్డి (37) కారు అదుపుతప్పి ముందున్న నీటి ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేద ప్రకాశ్ రెడ్డి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆయన కుమారుడు అర్జున్(2) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన బాధిత కుటుంబంలో విషాదం నింపింది.
- Advertisement -



