Wednesday, April 15, 2026
E-PAPER
Homeజాతీయంపవర్‌ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి

పవర్‌ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడు.. 10 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లా, సింగితారి గ్రామ సమీపంలో గల వేదాంత పవర్‌ ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో 10 మంది కార్మికులు మరణించగా, సుమారు 15 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కార్మికులు ప్లాంట్‌లో పని చేస్తున్నారు. పేలుడు ధాటికి తొక్కిసలాట జరిగి మరికొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు, వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -