Wednesday, April 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుదారుణం..సొంత తమ్ముడినే చంపేసిన అన్న

దారుణం..సొంత తమ్ముడినే చంపేసిన అన్న

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురలో అన్న హాసిం హుస్సేన్ తన సొంత తమ్ముడు షాఫ్దాన్ హుస్సేన్‌ను బుధవారం తెల్లవారుజామున హత్య చేశాడు. ఇద్దరి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హాసిం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -