Wednesday, April 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఓవర్ లోడ్ వాహనాలకు కొత్త రూల్స్...

ఓవర్ లోడ్ వాహనాలకు కొత్త రూల్స్…

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జాతీయ రహదారులపై పరిమితికి మించి బరువుతో (ఓవర్‌లోడ్) ప్రయాణించే వాహనాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రహదారుల భద్రతను పెంచడం, మౌలిక సదుపాయాలను కాపాడటమే లక్ష్యంగా కీలక సవరణలు చేసింది. ఈ మేరకు ‘జాతీయ రహదారుల రుసుము (రేట్ల నిర్ధారణ, సేకరణ) నాలుగో సవరణ నిబంధనలు, 2026’ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 15 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. వాహనదారులు నిర్దేశిత బరువు పరిమితులను కచ్చితంగా పాటించేలా చూడటం, తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడం ఈ సవరణల ప్రధాన ఉద్దేశం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -