Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్నాళ్ల ముచ్చటేనా.?

మున్నాళ్ల ముచ్చటేనా.?

- Advertisement -

– రోడ్డు నాణ్యతపై ప్రశ్నిస్తున్న పట్టించుకోరా.?
నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని అన్ సాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధి ఎస్సి కాలనీలో రూ.లక్షలతో నిర్మాణ పనులు చేపట్టిన సిమెంట్ రోడ్డు నాసిరకంగా వేయడం ద్వారా పగుళ్లు తెలి మున్నాళ్ల ముచ్చటగా మారిన సంబంధించిన అధికారులు పట్టించుకోకపోగా, సామాజిక మధ్యమాల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోరా.?..ప్రజాధనం దుర్వినియోగం కావాల్సిందేనా.? అని బిఆర్ఎస్ మండల నాయకుడు బానోతు రాజ్ కుమార్(ఢిల్లీ రాజు) బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు రోడ్డు వేసిన మరుసటి రోజుకే పగుళ్లు తేలినట్లుగా తెలిపారు.ఇదేనా ప్రజాపాలన అంటే ఇలాంటి నాసిరకం పనులు చేస్తూ కాంట్రాక్టర్ల జేబులు నింపడమేనాని మండిపడ్డారు.ఇప్పటికైనా నాసిరకం పనులు చేపట్టి ప్రజా సొమ్మును దోసుకున్న గుత్తేదారుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -