Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యుడు చిలువేరి మారుతికి సన్మానం

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యుడు చిలువేరి మారుతికి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ఫార్మా కౌన్సిల్ బోర్డులో సభ్యునిగా నామినేట్ అయిన ఐవీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిని కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ.. చిలువేరి మారుతి రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు ఆధ్యాత్మిక, అన్నదాన కార్యక్రమాలకు సహకరిస్తూ సామాజిక సేవలో ముందుంటున్నారని అన్నారు. సామాజిక బాధ్యతతో సేవలందిస్తున్న మారుతికి తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునిగా అవకాశం లభించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహం గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్, అధ్యక్షులు జమీల్ అహ్మద్, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, టాస్క్ సభ్యులు కొంక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -