Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ..

డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ-డిచ్ పల్లి : ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కాట్రోత్ బంతిలాల్ పేర్కొన్నారు ‌బుదవారం ఇందల్ వాయి మండలంలోని మేఘ్య నాయక్ తండా గ్రామ పంచాయతీ లో నూతనంగా వచ్చిన డిజిటల్ రేషన్ కార్డులను ఉప సర్పంచ్ మలోత్ సోమ్ల నాయక్,జిపిఓ రాజేశ్వర్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లాబ్దిదరులకు కార్డులను పంపిణీ చేశారు. ‌ఈ సందర్భంగా సర్పంచ్ కాట్రోత్ బంతిలాల్ మాట్లాడుతూ గత కోన్నేళ్ళుగా అర్హులైన వారికి నూతనంగా రేషన్ కార్డులు రాక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

ప్రస్తుతం  అర్హులైన వారందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందజేసి సన్నబియ్యం అందజేస్తున్న రని,ఒక్క రేషన్ కార్డుతో ఎన్నో పథకాలు పొందవచ్చని సర్పంచ్ కాట్రోత్ బంతిలాల్ అన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండలంలోని మేఘ్య నాయక్ తండా గ్రామంలో మంజూరైన 573 డిజిటల్ రేషన్ కార్డులను  లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. నూతనంగా73 కార్డులు మంజూరయ్యాయని,మొత్తం 573 రేషన్ కార్డులు ఉన్నట్లు వివరించారు.లాబ్దిదాలులకు రేండు రోజుల్లో డిజిటల్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని జిపిఓ రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హిరబాయి,ఎల్ రవీందర్ నాయక్,డి బేబిత,డి బావుసింగ్ నాయక్,ఎల్ శేంకర్ నాయక్ , ఎల్ సునితా,కె సునితా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సోమ్ల నాయక్,డి గంగారం నాయక్, పూర్య నాయక్, ఎల్ మోతిరం నాయక్,ఎల్ గోపాల్ నాయక్,కారోబార్ వినోద్ తోపాటు తాండ పేద్దలు, యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -